Answers

2015-08-24T02:29:04+05:30

This Is a Certified Answer

×
Certified answers contain reliable, trustworthy information vouched for by a hand-picked team of experts. Brainly has millions of high quality answers, all of them carefully moderated by our most trusted community members, but certified answers are the finest of the finest.
     మన దేశం సహజ సిద్ధమైన వనరులతో ఎంతో  సుందరమైనది.  ఇందులో ఏ సందేహమూ లేదు.   కొన్ని దశాబ్దాలనించి మనం  మన దేశాన్ని , మన చుట్టుపక్కల  ప్రదేశాలని  చెత్త చెదారాలతో నింపేసి పాడుచేశాం.  ఇప్పుడు ఇంక  ఈ సమస్యని పరిష్కరించాల్సిన సమయం వచ్చింది.   

     స్వచ్చ భారతం అనే కార్యక్రమం మన భారత ప్రధాన మంత్రి శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడి గారు 2014 సం. అక్టోబర్ 2 న మొదలు పెట్టారు.  ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నది.   శ్రీ  మోడి గారే  స్వయం గా  ఢిల్లీ లో  రోడ్డు ని  ఊడ్చి  శుభ్రం చేసి  అందరికి మార్గదర్శకులయ్యారు.   మహాత్మా గాంధి గారు  భారత వాసులందరూ  శుభ్రం, శుచి మరి ఆరోగ్యం గురించి బాగా తెలుసు కోవాలని, మరియు  అశుభ్రం అనారోగ్యానికి కారణాలు  తెలుసుకోవాలని   ఆశించారు.    ఈ కార్యక్రమం  గాంధీ గారి కలని  నిజం చేయాలని  చేపట్టారు.     ప్రజలందరూ ఇళ్లని, పరిసరాలని శుభ్రంగా  ఉంచుకునే పద్ధతులు  వాళ్ళకు తెలియ చెప్పడం కోసం, కొంత వరకూ శుభ్రం చేయడం  ఆ మిషన్   ముఖ్యోద్దేశం.

శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు , ఇదే స్వచ్ఛమైన  మన భారత దేశం
    
క్లీన్ ఇండియా  కోసం  ప్రతి వారం శని , ఆది వారాలలో  చాలామంది  ప్రజలు, తారలు, గొప్ప వాళ్ళు, ప్రముఖులు  రెండు మూడు గంటల సేపు  వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మరియు  జనసమూహం ఉన్న చోట  శుభ్రం చేస్తున్నారు.  ఈ మిషన్ లో  వచ్చే 5 ఏళ్లలో  సుమారు 62,000 రూ. ఖర్చు తో దాదాపు  4,౦౦౦ చిన్న పట్టణాలు  శుభ్రం చేస్తారునిర్మల్  భారట్ అభీయాన్  మిషన్  పల్లెలలో  మంచి శుభ్రమైన నీటికోసం మరియు శుభ్రత కోసం పని చేస్తుంది.   వాళ్ళు వేలాది  టోయిలెట్లు  (మరుగు దొడ్లు) అవి లేని  ఇళ్ళలోను  ఇంకా  సామూహిక ప్రదేశాలలోను (మార్కెట్టు, సంత లలో ముఖ్యంగా)  కడతారు.   వాళ్ళు  నగరంలో పొగయ్యే  చెత్త ని కూడా  తీసేసి శుభ్రం చేస్తారు.
వారానికి రెండే గంటల శ్రమ , అంతే  మన అందరి ఆరోగ్యానికి రక్షణ.

    
మనం ఏం చెయ్యాలంటే, మనం చెత్త ఇక్కడ అక్కడ, ఎక్కడో వేయకూడదు.  ఇంకొకళ్ళని వేయనీయకూడదు.  ప్రతి వారం రెండే  గంటలు మాత్రమే పని చేస్తే చాలు శుభ్రత కోసం.   మరి ఈ కార్యక్రమం కోసం చెత్త కుండీలు  అవి లేని చోటల్లా   పెడుతున్నారు.   కొత్తవి  కొని ప్రతి  కొలోని లోనూ  ఉంచుతున్నారు

     ఈ మిషన్ వల్ల  సమాజంలో అందరి ఆరోగ్యం బాగుపడుతుంది.  జబ్బులు తగ్గుతాయి.  మందులు  మిగులుతాయి.  బీదవాళ్ళ డబ్బులు మిగులుతాయి కూడా.  దేశానికి ఖర్చు తగ్గుతుంది, కనుక ఆర్ధిక స్ఠ్ఠితి లో వృద్ధి కనిపిస్తుంది.

    
పాఠశాల లో చదివే విద్యార్థులు కూడా ఇందులో పాల్గొంటున్నారు.  ఇందుకోసమని  ప్రభుత్వం  చాలా పాఠశాల బోర్డు లకు (సి.బి.ఏస్.సి., ఐ.సి.స్.సి., రాష్ట్ర బోర్డు తదితరులకు ) ఉత్తర్వూలిస్తూ  ఉత్తరాలు రాసింది.    ఆ బోర్డులు  తమ పాఠశాలలకు  ఉత్తర్వులు ఇచ్చాయి.   చాలామంది విద్యార్ధులు చేట, బుట్ట,  తట్ట పట్టుకొని  చాలా ప్రదేశాలను శుభ్రం చేసారు.    మరుగుదొడ్లు లేని  25,000 పాఠశాలల్లో  వాటిని నిర్మిస్తారు.   పాఠశాలలు చేయాల్సిందల్లా,  వాటిని మరియు వాళ్ళ  ఆవరణ ని శుభ్రం గా ఉంచకోవడం, అంతే.  


   
పిల్లలు  శుభ్రమైన వాతావరణంలో చదువుతూ పని చేయడానికి అలవాటు పడతారు.  వాళ్ళకు పాఠాలలో  శుభ్రత, ఆరోగ్యం మరియు వాటి లాభ నష్టాల గురించి శిక్షకులు గురువులు  బోధిస్తారు.   చిత్ర పటాల పోటీలు,  మాటల భాషణల   పోటీలు,  స్లోగెన్ (క్యాప్షన్) పోటీలు,  వాచ్య రచనల పోటీలు  నిర్వహించి  అందరిలో అశుభ్రత నష్టాల గురించి  అందరికి తెలిసేలా చేస్తున్నారు.

ఈ పని లో  మునిసిపాలిటీ కి  చాల ముఖ్యమైన పాత్ర ఉంది.  ఎక్కడైతే మునిసిపాలిటీ  ఆ పనిని  మంచి గా చేయలేకపోతోందో,  అక్కడ ప్రైవేటు సంస్థలకో, వ్యక్తులకో  ఈ పని అప్పగించితే  ఇంకా బాగుంటుంది.  శుభ్రంగా ఉండే పల్లెలకు, పాఠశాలకు, నగరాలకి  ప్రతి సంవత్సరం   బహుమతులు కూడా ఇస్తారు.

మనం చేయాల్సిందల్లా  మన టేబులు, గది, ఇల్లు, మరుగుదొడ్డి, ఆవరణ  అన్నీ శుభ్రంగా ఉంచుకోవడమే.  చాలు.  మన పరిసరాలలో చెత్త వేయకుండా చూసుకోవడం మన కర్తవ్యం.   మనం చేయడం మరి అందరినీ అలా చేయమని చెప్పడం. మంచి పౌరులు గా నిరూపించుకుందాం. శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు, ఇవే స్వచ్ఛమైన భారతానికి ఆభరణాలు. ఈ  స్వచ్చ భారతం  నిరాటంకం గా పూర్తి అవుతుంది.


   ఇప్పుడు ప్రతీ రాష్ట్రం లోనూ  పరిశుభ్ర భారతం కార్యక్రమాన్ని  ప్రతీ వారం  చేస్తున్నారు. 
 
2 5 2
థాంక్స్ బటన్ పైన క్లిక్ చేయండి